Saturday 22 December 2012

nayee brhamana poetry


barber
నాయీలకు అంట కత్తెర
నాయీ... అంటే సంస్కృతంలో ‘ముందు’ అని అర్థం ధ్వనిస్తుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం బ్రా హ్మణులతో ఏ కార్యం తలపెట్టినా ముందుగా మంగలి కులం వారి చేయి పడాల్సిందే! కనుకనే ఎంతోకాలంగా వీరు ‘నాూ బ్రాహ్మణులు’గా పిలువబడుతున్నారు. కనుకనే ప్రజాకవి వేమ న ఏమన్నాడో చూడండి... చిత్తశుద్ధి లేని జపమేల/ బ్రాహ్మణ జలముకన్న/ మంగలి జలము హెచ్చు/ విశ్వదాభిరామ విను రవేమా... అని వీరి ప్రాధాన్యతను ప్రస్తుతించారు. చరిత్ర లోనూ వీరి పూర్వీకులు తగిన స్థానం సంపాదించారనే చెప్పొ చ్చు. 

విజయనగర రాజుల కాలంలో సెైతం వీరి ప్రతిభ వెలుగు చూసింది. అప్పట్లో క్షురకర్మపెై పన్ను విధిస్తే ‘కొండోజు’ అనే నా ూబ్రహ్మణుడు అళియ రామరాయలును మెప్పించి ఆ పన్ను భారాన్ని తీసేయించారు. ఇక సామాజిక పరంగా చూస్తే వీరి సేవ క్షురకర్మకే పరిమితం కాలేదు. మహిళలు మంత్రసానులు గా నేటికీ మారుమూల ప్రాంతాలలో పురుడుపోస్తున్నారు. పు రుషులు ఆయుర్వేద వెైద్యులుగా, డోలుసన్నాయి మంగళ వా యిద్యకారులుగా మన్ననలు పొందుతున్నారు. అయితే మారుతున్న పరిణామ క్రమంలో సీన్‌ రివర్స్‌ అయ్యింది!

ఎన్నో రంగాలలో తమ ప్రతిభ చాటుకుంటున్నా నేటికీ ఎదు గూబొదుగూలేని జీవితం నాూబ్రాహ్మణులది. రాష్ర్టంలో సు మారు 9లక్షలమంది నాూ బ్రాహ్మణులు ఉన్నారు. వీరిలో ఎ క్కువభాగం కుల వృత్తిపెై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ర్టంలో విస్తరించిన 2.50లక్షల క్షౌరశాలల్లో దాదాపు నాలుగు లక్షల మంది వృత్తి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నాూ బ్రాహ్మణులు సాంప్రదాయ వృత్తికు పరిమితం కావడంతో అ క్కడివారికి రోజలు గడవటమే కష్టంగా మారింది. ఇక పట్టణ ప్రాంతాలకు వలసవచ్చిన నాూలలో కొందరు మాత్రమే అ దునాతన సెలూన్‌లు నడుపుతున్నారు. 

అగ్రకులాలు నడుపుతున్న బడాబడా సెలూ న్‌ల స్థాయిలో సేవలందిస్తున్నారు. చాలా మంది రోడ్డు పక్కన చిన్న చిన్న బంకులు పెట్టుకునో, ఫుట్‌పాత్‌ మీద పట్టా పరుచు కునో కులవృత్తి చేస్తూ జీవనం సాగిస్తు న్నారు. ఇక మధ్య తరగతివారి కోసం వీరు నిర్వహించే సెలూన్లతో వీరు బొటాబొటీ జీవ నం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిభ కలిగిన అనేకమంది నాూ బ్రాహ్మణులకు ప్రభుత్వం నుండి, బ్యాంకుల నుండి తగిన ఆర్థిక సహాయ అందకపోవడంతో బడాబా బులు నిర్వహిస్తున్న సెలూన్‌లు, బ్యూటీ పా ర్లర్లలో పనికి పరిమితమయ్యారు. అంటే కష్టం నాూలది, కాసులు బడాబాబులవి. 

tablelellllఈ క్రమంలో క్షురకవృత్తి ఇప్పుడు బడా వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. హైదరా బాద్‌, విశాఖ, తిరుపతి, విజయవాడ వంటి నగరంలో హైటెక్‌ సెలూన్‌ నిర్వహించాలంటే కనీసం 25 లక్షల రూపాయలు పెట్టుబ డిపెట్టాలి. హైదరాబాద్‌ నగరంలో సెలూన్‌ ప్రారంభించాలంటే పగిడీ రెండు లక్షల నుం డి పది లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇక అద్దెల రూపేణా నెలకు లక్ష రూపాయలు చెల్లిం చాలి. ఈ సెలూన్‌లో వినియో గించే ఒక కుర్చీ ఖరీదు పాతిక వేల రూపాయల పెైమాటే. ఇవి కాక సెలూన్‌లో పనిచేసేవారికి నెల జీతాలు, కాస్మోటిక్స్‌... ఇలా మరెన్నో ఖర్చులు. ఇక్కడ క్రాప్‌ చేయటంతోపాటుగా బా డీ మసాజ్‌, స్టీమ్‌ బాత్‌, స్థూల కాయాన్ని తగ్గించటం వంటివి ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమా లు కూడా నిర్వహిస్తుంటారు. 

వీటిని నిర్వహించగల నేర్పు, నెై పుణ్యం వీరికి ఉన్నప్పటికీ ఆర్థి క స్థోమతలేక పోవడం, జాతీ య బ్యాంకులు సహకరిం చకపోవటంతో హైటెక్‌ సెలూన్‌ లలో నెల జీతగాళ్లుగా పని చేస్తున్నారు. ఈ హైటెక్‌ సెలూన్ల నిర్వహణ లాభసాటి వ్యాపారం కావటంతో అగ్రకులానికి చెం దిన వారు రాష్ర్ట వ్యాప్తంగా బ్రాంచీలు పెట్టిమరీ నడిపిస్తూ, డిప్లమో కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ మాజీ క్రికెటర్‌ కూడా హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో మెన్స్‌ బ్యూటీ పార్లర్‌కు పెట్టు బడిపెట్టారంటే ఇది ఎంత లాభసాటి వ్యాపారంగా మా రిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ధోరణి మారాలంటే నాూ బ్రాహ్మణులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాల్సి ఉంది. గతంలో వీరిని ఎయిడ్స్‌ సమస్య వెంటాడింది. క్షవరం చేయటానికి ఉపయోగించే కత్తు ల ద్వారా ఎయిడ్స్‌ వ్యాధి విస్తరిస్తుందనే ప్రచారం ముమ్మరం కావటంతో బ్లేడు కత్తిని ఉపయోగించటం ప్రారంభించారు. 

అయితే షేవింగ్‌, ట్రిమ్మింగ్‌ చేయటానికి ఆ బ్లేడుకత్తి ఉప యోగిస్తే మిసమిసలాడే ముఖం ముదిరిపోతుందనే ప్రచారం ఈ మధ్య ముమ్మరం కావటంతో సెలూన్లలో అనివార్యంగా ఎలక్ట్రికల్‌ మిషన్లు వాడాల్సి వస్తుంది. సెలూన్‌లో ఎలక్ట్రికల్‌ మిషన్‌ వాడకానికి శ్రీకారం చుడితే క్రమక్రమంగా షాపులోని వస్తువులన్నీ అత్యాధునిక పరికరాలవెైపు మొగ్గు చూపాల్సిందే! అన్ని పరికరాలూ మార్చు కోవడానికి వారిి తగినంత ఆర్థిక స్తోమతులేదు. దీంతో కస్టమర్లు దూరమవుతున్నారు. ఇక వీరిని వెంటాడుతున్న మరో సమస్య కాస్మోటిక్స్‌ ఖర్చులు. ఇప్పుడు చిన్న చిన్న సెలూన్లలో కూడా మేకప్‌ చేయ టం, జుట్టు కు రకరకాల రంగులు డెై చేయటం సర్వసాధారణమైంది. కను క కనీసం ఆయా వస్తుపులపెై తమకు రాయితీలు కల్పించాలని నాూబ్రాహ్మణులు కోరుతున్నారు. తమ వృత్తిని కోలుకోలేని దెబ్బతీస్తున్న బడా వ్యాపారులను కట్టడి చేయాలని నాూ బ్రాహ్మణులు వేడుకొంటున్నారు. 

ఉద్యమ పునాదులు వేస్తున్నాం
Guntuమా పూర్వీకులు ఆయిష్‌ కర్మ (వెైద్యం) చేసేవారు. మంగలి కత్తితో సక్సస్‌ఫుల్‌గా సర్జరీ చేసేవారు. చెరకుడు మావాడే. ఇప్పటీకీ రాష్ర్టంలోని గ్రామాలలో 60 శాతం ఆర్‌ఎంపీ డాక్టర్లు మావేళ్లే. తెలంగాణ, రాయలసీమల్లో మంత్రసాని బాధ్యతలు చేపడుతుంది నాూ బ్రాహ్మణ స్త్రీలే. ‘దాయి’లుగా పిలువబడుతున్న వీరికి 1985 వరకు ప్రభుత్వం గౌరవ వేతనం అందించేది. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ విధానానికి తిలోదకాలు పలికింది. ఇక కార్పొరేట్‌ ఆస్పత్రులతో ఇప్పటికీ 80శాతంమంది నాూ బ్రాహ్మణులే కాంపౌండర్లుగా పని చేస్తున్నారు. వాయిద్య వృత్తి కూడా హైజాక్‌ చేయబడింది. కళల్ని తరతరాలుగా కాపాడుకొస్తున్నాం కనుకనే... నాటి రాజులు దేవాలయాల్లో అర్చకులతోపాటు వాయిద్యకారులుగా నాూ బ్రాహ్మణులకు తగిన ప్రాధా న్యత ఇచ్చేవారు. ఇప్పుడు నా ూ బ్రా హ్మణులకు ఆ స్థాయి ప్రాధాన్యత ఇవ్వ కపోవడం శోచనీయం. భగవంతుడిని మంగళవాయిద్యాలతో నిద్రలేపాలి, మంగళ స్నానం చేయించేప్పుడు మంగ ళవాయిద్యాలు మ్రో గించాలి. అయితే ఈ ఆనవాయితీకి చా లా దేవాలయాలు తిలోదకాలు పలికాయి. కనుకనే ఉద్య మానికి పునాదులు వేస్తున్నాం, వినతిపత్రాలతో ప్రారంభమయే ఈ ఉద్యమం మా హక్కులు సాధించేవరకూ కొనసా గిస్తాం. 

గిన్నిస్‌ రికార్డ్‌
Taaహైదరాబాద్‌ రవీంద్రభారతిలో మొత్తం 35 తాళములతో పంచగతుల ప్రసార కార్యక్రమాన్ని 13 నిమిషాల వ్యవధి లో డోలు వాయించి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు తరిగోపుల నారాయణ. అయితే సర్టిఫికెట్‌ తీసుకోవడానికి నిరాకరిం చారు. ‘‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సర్టిఫికెట్‌ను నేను తిరస్కరించలేదు... విద్వత్‌కు గుర్తింపు ఇవ్వాలని కోరుతు న్నాను. ఆ కేటరిగిలో సర్టిఫికెట్‌ ఇస్తే స్వీకరించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు..’ అంటారు నారాయణ. ఇక దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలూ మరెన్నో పురస్కారాలు అందుకున్న వీరికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మా పుర స్కారం రాకపోవడం ఆశ్చర్యం.ఇదే అంశంపెై ఆయన స్పందన చూడండి. ‘సంగీతంలో నిష్ణాతులెైన నాూ బ్రాహ్మణులు ఎంతో మంది ఉన్నప్ప టికీ వారికి తగిన గుర్తింపు లేదు. ప్రభుత్వం కూడా వారిని పద్మ అవార్డులకు దూరం చేస్తోంది. పద్మా అవార్డు కాదు కదా... కనీసం ఉగాది పురస్కారా లకు కూడా ఏ ఒక్క నా ూ బ్రాహ్మణుడూ నోచుకోలేదు...’ అంటూ పెదవి విరిచారు. కళా ప్రదర్శనలో నాూ బ్రాహ్మ ణులు కళాకౌశలం పరాకాష్టకు చేరుకున్నా విద్యకు దూరం కావడంతో తగిన గుర్తింపునకు నోచుకోలేకపోతున్నారని అ భిప్రాయపడ్డారు. చట్టసభలలో నాూ బ్రాహ్మణుల ప్రాతి నిధ్యం లేకపోవడం కూడా మరోకారణంగా పేర్కొన్నారు.

బడుగుల ఆత్మాభిమానికి ప్రకాష్‌ ఓ మచ్చుతునకబ
Caaఆరవ తరగతి చదువువున్న సిహెచ్‌ ప్రకాష్‌ ప్రమాదవశా త్తు రెండు కాళ్లు కోల్పోయినా ఆత్మస్థైర్యాన్ని మాత్రం వదులు కోలేదు. ఈ ప్రమాదం జరగ డానికి ఏడాది ముందు తన తండ్రి మృతి చెందాడు. కస్టా లన్నీ కట్టకట్టుకని వచ్చినా సహవిద్యార్థుల ప్రోత్సాహం తో పదవ తరగతి పూర్తి చేశా డు. భవిష్యత్‌ అగమ్య గోచరంగా ఉన్నప్పటికీ వికలాంగు డను... అంటూ వీధిన పడలేదు, బిక్షాటన చేయలేదు. ఉన్న త చదువులు చదివే స్తోమతులేని ప్రకాష్‌ అప్పట్లోనే విక లాంగుల కోటాలో పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌ ప్రారంభించి స్వశ క్తిపెై నిలిచి కుటుంబాన్ని పోషించే ప్రయత్నం చేశాడు. అ యితే సామాన్యుల చేతుల్లోకి సెైతం సెల్‌ఫోన్లు రావడంతో రాబడికి గండిపడింది. 
దీంతో గత్యంతర లేక కుల వృత్తి చేయడానికి సిద ్దపడ్డాడు. అయితే రోజంతా కొయ్య కాళ్లపెై నిలబడి పనిచే యడంతో రాత్రయ్యే సరికి నరకాన్ని చూ డాల్సి వస్తోందం టాడు. జెైపూర్‌ కాళ్లు అమర్చుకుంటే కొం త ఉపశమనం ఉంటుందంటాడు. అయితే కుటుంబ పోష ణే కష్టమైతే ఇక జెైపూర్‌ ఫుట్‌కు డబ్బులెక్కవి? అని బిక్కమె హం వేశాడు. కనుకనే దాతలెవరెైనా వచ్చి తన కన్నీరు తు డుస్తారని ఆశగా ఎదురు చూస్తూ రోజులు నెట్టుకొస్తున్నాడు.

No comments:

Post a Comment